Wednesday, 20 February 2019

Monday, 18 February 2019

TMF Representations to solve maths teachers problems to higher officials

*⭕TMF*


TMF  Represented Maths teachers issues to Ex.Minister E.Rajender garu   on 17.02.2019 at his camp Office.


*⭕TMF*

తెలంగాణ గణిత ఫోరం


గణిత ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని  DSE కమిషనర్ గారిని, DGE డైరెక్టర్ గారిని, SCERT అధికారులను 18.02.2019  వ తేదీన కలిసిన TMF రాష్ట్ర అధ్యక్షులు పసుపులేటి నరేంద్రస్వామి, రాష్ట్ర కార్య నిర్వాహక అధ్యక్షులు తాడ్వాయి శ్రీనివాస్, సహాధ్యక్షులు అయ్యన్న, మీడియా కార్యదర్శి లక్ష్మినారాయణ గారు సత్వరమే పరిష్కరించాలని కోరారు.



Monday, 11 February 2019

10 వ తరగతి గణితం పబ్లిక్ పరీక్షల్లో ఎక్కువ మార్కులు సాధించుటకు సూచనలు

తెలంగాణ

🈴*10వ తరగతి విద్యార్థులకు సూచనలు* 🈴


*గణితం*⚓


*గణిత పరీక్ష మొదటి పేపర్‌ ఏడు(1-7) అధ్యాయాలు, రెండో పేపర్‌ ఏడు(8-14) అధ్యాయాల నుంచి ప్రశ్నపత్రాలు రూపొందుతాయి.*

*👉విద్యార్థులు ఇప్పటినుంచే పూర్తయిన అధ్యాయాలకు ఉదయం ఒక గంట, సాయంత్రం ఒక గంట అధ్యాయాల వారీగా పేపర్‌-1, 2లకు సంబంధించిన సమస్యలను సాధన చేయాలి.*

👉అధ్యాయాల వారీగా సాధన చేసేందుకు మొదటగా అధ్యాయంలోని భావనల అవగాహన కోసం ఇచ్చిన వాక్యాలను, వివరణలను, ఉదాహరణ సమస్యలను పూర్తిస్థాయిలో చదవాలి. ‘ఇవి చేయండి’, ‘ప్రయత్నించండి’, ఆలోచించండి’, చర్చించండి’లో ఉన్న సమస్యలను సొంతంగా చేయాలి.

*👉ముందుగా అభ్యాసాల్లోని లెక్కలను సాధన చేయాలి. తర్వాత ఉపాధ్యాయుల సహకారంతో అలాంటివే కొన్ని కొత్త సమస్యలను రూపొందించి అభ్యాసం చేయాలి.*

👉*కొత్త సమస్యలను రూపొందించేప్పుడు అధ్యాయాల్లోని భావనల అవగాహన కోసం ఇచ్చిన వివరణల నుంచి ‘ప్రయత్నించండి.. ఆలోచించండి.. చర్చించండి’లో ఉన్న రీజనింగ్‌ లాజిక్‌ల ఆధారంగా తీసుకోవాలి. వాటినే అభ్యాసం చేయాలి* 

👉*ఈ అభ్యాసమే గణితంలో మంచి ప్రగతిని సాధించడానికి దోహదం చేస్తుంది*


*👉నాలుగు, రెండు మార్కుల ప్రశ్నలకు సమాధానాలు దాదాపుగా ఇచ్చిన సమస్యలోని దత్తాంశానికే చెందినవిగా ఉంటాయి.*


* *ఇచ్చిన సమాచారం, అవసరమైన పటాలు మొదలైనవి గుర్తించి సరిగా రాస్తే రెండు పేపర్లలో కలిసి సుమారు 14 మార్కులు పొందే అవకాశముంది. ఇందుకు సమస్యలను చదివి అవగాహన చేసుకోవడం, సమచారాన్ని గుర్తించడం, ఏం తెలుసుకోవాలో గుర్తించడం, పటాలు రాయడం వంటివి బాగా అభ్యాసం చేయాలి*


*🖕ప్రతీ అధ్యాయంలో 3, 4 ప్రధాన భావనలుంటాయి. వాటిని బాగా అవగాహన చేసుకొని వాటికి చెందిన ఉదాహరణ, ‘ఇవి చేయండి’, ‘ప్రయత్నించండి’, అభ్యాసంలోని వివిధ రకాల సమస్యలను వ్యాసరూప, లఘు, అతి లఘు, బహుళైచ్ఛిక ప్రశ్నలుగా విభజించి అభ్యాసం చేయాలి. ఉదాహరణకు వాస్తవ సంఖ్యలు అధ్యాయంలో ప్రధానంగా మీకు యూక్లిడ్‌ భాగాహార న్యాయం, అంక గణిత ప్రాథమిక సిద్ధాంతం, కరణీయ సంఖ్యలు, సంవర్గమాన ధర్మాలు తదితర భావనలకు చెందిన సమస్యలు, వాటిపై విశ్లేషణాత్మక అవగాహన, రీజనింగ్‌, వాటి వినియోగానికి చెందిన సమస్యలను అభ్యాసం చేయాలి*.

*👉జ్యామితీయ భావనలకు చెందిన సిద్ధాంతాలను బాగా అధ్యయనం చేయాలి. సిద్ధాంతాలకు చెందిన వినియోగంపై సమస్యలు రూపొందించి ఇస్తారు*.


*👉త్రికోణమితి అనువర్తనాల్లో దత్తాంశాన్ని పటాలుగా గీయడంపై అభ్యాసం చేయగలిగితే ఈ అధ్యాయంలో ఎలాంటి సమస్య ఇచ్చినా చేయగలరు.*


*👉*గ్రాఫుల నిర్మాణంలో సరైన స్కేలును ప్రదర్శించడం, గ్రాఫులకు చెందిన విలువలను సరిగ్గా నమోదు చేయడం, జ్యామితి నిర్మాణానికి చెందిన సమస్యలు గీయగలగాలి.*


*👉క్షేత్రమితిలో ఘణాకార వస్తు సముదాయాలతో  (combination of solids) కూడిన సమస్యలపై అభ్యాసం చేయాలి. ఒక రూపంలో ఉన్న వస్తువు మరో రూపంలోకి మార్చడం, వాటి మధ్య ఉన్న సంబంధంతో కూడిన సమస్యలపై పట్టు సాధించాలి.*సమస్యకు సంబంధించిన పటము తప్పనిసరి వేయాలి*


*,👉సాంఖ్యాకశాస్త్రం, నిరూపక జ్యామితి, సంభావ్యత అధ్యాయాలు మంచి స్కోరు చేయడానికి ఉపయోగపడే అధ్యాయాలు. వీటిలోని భావనలను లోతుగా అర్థం చేసుకోవాలి.*


*👉ఈ అధ్యాయాల్లోని వివిధ రకాల ఉదాహరణలను అవగాహన చేసుకొని అభ్యసించాలి.*

👉గణితములో  మిగతా సబ్జక్టులతో పోలిస్తే ప్రిపరేషన్ విధానము చాలా విభిన్నంగా ఉండాలి 

ప్రతిరోజు ఇతర సబ్జెక్టు లతో పాటుగా ఒక గంటైనా తప్పకుండా కేటా యిస్తే భావనలు ఎల్లప్పుడూ గుర్తుండే అవకాశము ఉంటుంది.

👉దత్తాంశము,ఫార్ములాలు  రాసినట్లైతే ఒకమార్కు నుండి ఒకటిన్నర వరకు పొందడము సులభం.